దటీజ్ సూపర్ స్టార్: బర్త్ డే ట్రీట్‌తో మానవత్వం చాటుకుంటున్నాడుగా .!

- August 04, 2022 , by Maagulf
దటీజ్ సూపర్ స్టార్: బర్త్ డే ట్రీట్‌తో మానవత్వం చాటుకుంటున్నాడుగా .!

ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాల్ని ధియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ‘ఒక్కడు’ సినిమాని పలు చోట్ల ప్రదర్శించారు. ఆగస్టు 9న మహేష్ బాబు కెరీర్ బెస్ట్ ఫిలిం అయిన ‘పోకిరి’ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారట. అలా వచ్చిన సొమ్మును ఛారిటీ కోసం వుపయోగించాలని డిసైడ్ అయ్యారట. 

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం రీల్ హీరోనే కాదు, రియల్ హీరో అనిపించుకుంటున్నాడు కూడా పలు సామాజిక కార్యక్రమాలు ద్వారా. అందులో భాగంగానే చిన్న పిల్లల గుండె సంబంధిత శస్ర్త చికిత్సల నిమిత్తం ఓ ఛారిటీని స్టార్ట్ చేశారాయన. ఆ ఛారిటీ ద్వారా వైద్యం చేయించుకోలేని పేద పిల్లలకు ఖరీదైన గుండె సంబంధిత శస్ర్త చికిత్సలను వుచితంగా చేయిస్తున్నారు. 

ఆ ఛారిటీ కోసమే, తాజాగా ఆయన బర్త్ డే సందర్భంగా ప్రదర్శిస్తున్న ‘పోకిరి’ సినిమా స్పెషల్ షోల ద్వారా వచ్చే మొత్తం సొమ్మును వినియోగించేయనున్నారట. రాజువయ్యా.. మహరాజువయ్యా..! అనలేకుండా వుండలేకపోతున్నాం. ఆయనే కాదు, ఆయన అభిమానులు కూడా అంతే. దాన గుణంలో మిన్న. 

ఇక, మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాలో నటిస్తున్నారు. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు మహేష్ బాబు సంసిద్ధమవుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com