‘కృష్ణమ్మ’గా సత్యదేవ్: మాములుగా వుండదు మరి.!
- August 04, 2022
అప్పుడెప్పుడో పూరీ కంపెనీ ద్వారా ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు సత్యదేవ్. తొలి సినిమాకే సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఈ నటుడి సినీ ప్రయాణం హీరో వరకూ ఎదిగింది.
హీరో అంటే హీరోనే కాదు, విలక్షణ నటుడు. సరికొత్త జోనర్ కథలతో ఆకట్టుకుంటున్నాడు. మొన్నీమధ్యనే ‘గాడ్‌సే’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. తాజాగా ‘కృష్ణమ్మ’ అంటూ పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్ మూవీతో వస్తున్నాడు.
ఈ సినిమాకి కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
ఇంటెన్స్ ‘రా’ యాక్షన్ స్టోరీగా రూపొందుతోన్న ‘కృష్ణమ్మ’ సత్యదేవ్‌ని నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందనిపిస్తోంది ఈ టీజర్ చూస్తుంటే. ఓ ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే కథగా ఈ సినిమా రూపొందింది.
కృష్ణా నదితో తనకున్న అనుబంధాన్ని, తన కథకు ముడిపెట్టి హీరో తన పాత్రను పరిచయం చేసే తీరును ఈ టీజర్‌లో కట్ చేశారు. ‘ పుట్టిన ప్రతీ ఓడికీ ఏదో కథ వుండే వుంటది.. కథ నడక, నది నడతా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ గెలక్కూడదు.. కానీ గెలికారు..’ అంటూ సత్యదేవ్ చెప్పేతన పాత్ర తాలూకు డైలాగ్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







