‘బింబిసార’ ఆ విషయంలో కాస్త బెటర్.!
- August 04, 2022
ఈ మధ్య పెద్ద సినిమాలకు కూడా పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ఈ మధ్య వచ్చిన ‘ది వారియర్’, ‘అంటే సుందరానికి’ తదితర సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ అస్సలు లేవు. అలాగే, పెద్ద సినిమాలైన ‘సర్కారు వారి పాట’ తదితర సినిమాలకు సైతం అంతంత మాత్రంగానే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్.
కానీ, కల్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా ఆ విషయంలో కాస్త బెటర్ అనిపిస్తోంది. ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈ సినిమాని తమ భుజాలపై వేసుకోవడమే అందుకు ఓ కారణంగా చెప్పొచ్చేమో.
లిమిటెడ్ స్ర్కీన్స్‌పైనే ‘బింబిసార’ను రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. కథ, కథనం పరంగా ‘బింబిసార’ కాస్త డిఫరెంట్ జోనర్ అనిపిస్తోంది. రెండు రకాల వేరియేషన్స్‌లో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. క్రూరమైన అత్యంత కఠినమైన రాజు పాత్రలో నెగిటివ్ షేడ్స్ చూపిస్తూనే, మరోవైపు అల్ర్టా మోడ్రన్ లుక్స్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్.
అలాగే, యాక్షన్ ఘట్టాల్లో విజువల్స్ కళ్లు చెదిరిపోయేలా వుండబోతున్నాయట. కొత్త డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాతో ఇండస్ర్టీకి పరిచయమవుతున్నాడు. ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్‌లో కల్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించారు. కేథరీన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.
మరోవైపు పెద్ద బ్యానర్ అయిన వైజయంతీ మూవీస్ నుంచి వస్తున్న ‘సీతారామం’ సినిమా కూడా ఇదే రోజు రిలీజ్ వుండడంతో, ‘బింబిసార’కు గట్టి పోటీనే నెలకొంది. ఆ పోటీని తట్టుకుని బింబిసారుడు విజయం సాధిస్తాడా.? లేదా.? కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







