అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2022
- August 05, 2022
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Great Freedom Sale)లో భాగంగా పలు స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో iPhone 13 భారీ డిస్కౌంట్ అందిస్తోంది. Apple స్మార్ట్‌ఫోన్ (128GB) ప్రస్తుతం రూ. 68,900గా ఉంది. అసలు (MRP) ధర కన్నా రూ. 11వేలు తక్కువకే అందిస్తోంది. 256GB, 512GB స్టోరేజీ మోడల్‌లు కూడా అమెజాన్ సేల్ ఈవెంట్‌లో భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యుల (Amazon Prime Members) కోసం Live Sale అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్టోరేజీ మోడల్ ధరలు వరుసగా రూ.76,900, రూ. 1,03,999గా ఉన్నాయి. అలాగే
ఐఫోన్ 13 మోడల్ రెడ్, బ్లూ, గ్రీన్, మిడ్‌నైట్ (డార్క్ బ్లూ), వైట్, పింక్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో వస్తుంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు.. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఈ డీల్ ద్వారా డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. మీరు మీ పాత ఐఫోన్లలో ట్రేడింగ్ చేస్తే.. Amazon వాల్యూ రూ.13,050 వరకు అందిస్తోంది. iPhone 7 విలువైన మోడల్ ధర రూ. 6,450 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే దీనికి బ్యాంక్ ఆఫర్ వర్తించదు. SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు అమెజాన్ సేల్‌లో ఎంపిక చేసిన ఫోన్‌లు, ప్రొడక్టులపై రూ. 2వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ సేల్ ఈవెంట్ సమయంలో ధరల్లో మార్పులు ఉంటాయని గమనించాలి. ధరలలో హెచ్చుతగ్గులను చెక్ చేసేందుకు ప్రైస్ ట్రాకర్ వంటి Chrome Extension యాడ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ఆగస్టు 6న భారత మార్కెట్లో ప్రారంభం కానుంది.
ఈ రెండు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ధరలను ఓసారి పరిశీలించి మీకు నచ్చిన మోడల్ కొనుగోలు చేయొచ్చు.స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. iPhone 13 కొన్ని మార్పులతో దాదాపు iPhone 12 మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్ 13 ఫోన్.. మోడ్రాన్ చిప్‌సెట్‌తో వస్తుంది. A15 బయోనిక్ చిప్. అది పెద్ద బ్యాటరీతో వచ్చింది. కెమెరా యాప్ కొత్త సినిమాటిక్ మోడ్‌ను అందిస్తుంది. పాత iPhoneలు, వివిధ రకాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉండే పోర్ట్రెయిట్ మోడ్‌లో వీడియోలను అనుమతిస్తుంది. అన్ని iPhone మోడల్‌లు ఇప్పుడు బాక్స్‌లో ఛార్జర్ లేకుండానే వస్తున్నాయి. ప్యాకేజీలో Type-C నుంచి USB లైటింగ్ కేబుల్ ఉంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







