ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌

- August 05, 2022 , by Maagulf
ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌

ముంబై: సీనియర్‌ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (NRI)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాదించింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో శుక్రవారం ఈ మేరకు ప్రతిపాదించారు. క్రాస్-బోర్డర్ ఇన్‌వర్డ్ పేమెంట్‌ల ఆమోదానికి వీలు కలగనుంది. తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మిత్రమే మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్‌ఆర్‌ఐలకు లభించనుంది. దీంతో ఎన్‌ఆర్‌ఐలకు కూడా భారీ ఊరట కలగనుంది. దీనికిసంబంధించి విధి విధానాలను త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్‌ చెప్పారు.

తాజా నిర్ణయం ప్రకారం ఎన్‌ఆర్‌ఐలను భారతదేశంలోని వారి కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య ,ఇతర బిల్లు చెల్లింపులు విదేశాల నుంచే సులభంగా చేసుకోవచ్చు. ఇప్పటికే నెలవారీ ప్రాతిపదికన ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న ఈ ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు, ప్రత్యేకించి వారి కుటుంబాల్లోని సీనియర్‌ సిటిజన్లకు పయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.బీబీపీఎస్‌ సేవల వృద్దితోపాటు, అదనంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందవచ్చని యురోనెట్ వరల్డ్‌వైడ్ ఇండియా అ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్ ఝవేరి అన్నారు.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com