యూఏఈలో కొత్త పెయిడ్ పార్కింగ్ జోన్‌లు
- August 06, 2022
యూఏఈ: షార్జాలోని ఖోర్ ఫక్కన్‌లో కొత్త పెయిడ్ పార్కింగ్ జోన్‌లు ప్రారంభమయ్యాయి. షేక్ ఖలీద్ వీధిలో పెయిడ్ పార్కింగ్ సమయాలు శుక్రవారం మినహా ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అలాగే కార్నిచ్ స్ట్రీట్, షీస్ పార్క్, అల్ రఫీసా డ్యామ్‌లలో వారంలో అన్ని రోజులు ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న షార్జా పౌరులు పార్కింగ్ స్థలాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని అథారిటీ ప్రకటించింది. ఈ సదుపాయాన్ని పొందేందుకు వృద్ధులు తప్పనిసరిగా 1. ఎమిరేట్స్ ID, 2. వాహనం ఆర్సీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని మున్సిపాలిటీ తెలిపింది. పత్రాలను ఖోర్ ఫక్కన్ మునిసిపాలిటీ వెబ్‌సైట్ www.khormun.gov.ae ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు లేదా ఖోర్ ఫక్కన్‌లోని అల్ ముదిఫీ ప్రాంతంలోని ప్రధాన కార్యాలయంలో వ్యక్తిగతంగా సమర్పించవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







