వ్యాక్సినేషన్ కోసం కువైట్ లో 16 ప్రత్యేక కేంద్రాలు
- August 06, 2022
కువైట్ : కోవిడ్-19 వ్యాధిని ఎదుర్కొనే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సేవలను అందించడానికి ప్రత్యేకంగా 16 ఆరోగ్య కేంద్రాలను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేటాయించింది. ఈ కేంద్రాలు ఆగస్టు 10వ తేదీ నుంచి పనిచేయనున్నాయి. ఆదివారం నుండి గురువారం వరకు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రాలు తెరచి ఉంటాయి. అబ్దుల్ రెహ్మాన్ అల్-జైద్ హెల్త్ సెంటర్ వెస్ట్ మిష్రెఫ్‌లో ఫైజర్ వ్యాక్సిన్ ను 5 నుండి 12 సంవత్సరాల పిల్లలకు (మొదటి, రెండవ డోసులు).. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు (మూడవ బూస్టర్ డోస్, నాల్గవ బూస్టర్) టీకా సేవలను అందించడానికి కేటాయించారు. 50 అంతకంటే ఎక్కువ వయస్సు వారికి మిగిలిన 15 ఆరోగ్య కేంద్రాలు రిజర్వ్ చేయబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







