ఖతార్ లో 13,430 హెక్టార్లకు చేరుకున్న సాగు భూమి
- August 06, 2022
ఖతార్: ఖతార్ సాగు భూమి 13,430 హెక్టార్లకు చేరుకుంది. 2021లో 772,829 టన్నుల పండ్లు, కూరగాయలు, ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యవహారాల విభాగం తన సోషల్ మీడియాలో తెలిపింది. 2,766 హెక్టార్లలో సాగు చేయబడిన కూరగాయల ఉత్పత్తి 2021 నాటికి 101,882 టన్నులకు చేరుకుందని పేర్కొంది. 2,703 హెక్టార్లలో 29,933 టన్నుల పండ్లను ఉత్పత్తి చేశారు. దీంతోపాటు 394 హెక్టార్లలో 3,305 టన్నుల ధాన్యాన్ని సాగు చేశారు. అలాగే 2021లో 7,566 హెక్టార్లలో 637,706 టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములు పెరుగుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తి ఖతార్ జాతీయ ఆహార భద్రతా వ్యూహం 2018-2023 విజయాన్ని తెలుపుతోందని వ్యవసాయ విభాగం పేర్కొంది. టేబుల్ గుడ్ల ఉత్పత్తిని 70 శాతానికి, చేపలను 90 శాతానికి, రొయ్యలను 100 శాతానికి, రెడ్ మీట్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







