సూపర్ స్టార్ మహేష్ దృష్టి ఈ సారి ఎవరి మీద పడుతుందో.!

- August 08, 2022 , by Maagulf
సూపర్ స్టార్ మహేష్ దృష్టి ఈ సారి ఎవరి మీద పడుతుందో.!

ముందుగా అనుకున్న డైరెక్టర్లకు సింపుల్‌గా హ్యాండిచ్చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గతంలో వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయాల్సి వుంది మహేష్ బాబు. కానీ, లాస్ట్ మినిట్‌లో ఆ సినిమాకి హ్యాండిచ్చేసి, అప్పుడు ట్రెండింగ్‌లో వున్న అనిల్ రావిపూడితో సినిమాకి కమిట్ అయిపోయాడు. 

అదే ‘సరిలేరు నీకెవ్వరు..’ మహేష్ అంచనాలు నిజమయ్యాయ్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ, వంశీ పైడిపల్లి అన్యాయమైపోయాడు.ఆ తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాలి మహేష్ బాబు. ఆ సినిమాని పక్కన పెట్టేసి, ‘గీత గోవిందం’‌తో హిట్ కొట్టిన పరశురామ్‌తో సింపుల్‌గా సినిమాకి కమిట్ అయిపోయాడు. అలా వచ్చిందే ‘సర్కారు వారి పాట’ సినిమా. 
ఇక్కడా మహేష్ లెక్కలు తప్పు కాలేదు. సెన్సేషనల్ హిట్ కొట్టాడు ‘సర్కారు వారి పాట’ సినిమాతో. ఇక ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్‌తో సినిమా చేయాలి. కానీ, ఈ ప్రాజెక్ట్ అయినా తెరకెక్కుతుందా.? కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయ్.

లేటెస్టుగా హిట్ కొట్టిన డైరెక్టర్‌ని మహేష్ పట్టేస్తాడేమో.. అంటూ ఇండస్ట్రీలో ఇన్ సైడ్ సోర్సెస్ టాక్. అలా జరగాలంటే, మహేష్ దృష్టి, ‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడి కానీ, లేదంటే కొత్త డైరెక్టర్ ‘బింబిసార’తో హిట్ కొట్టిన వశిష్ట్ అయినా కావచ్చు. చూడాలి మరి, సూపర్ స్టార్ దృష్టి‌ ఈ డైరెక్టర్ల మీద పడుతుందా.? లేక కమిట్మెంట్‌కి కట్టుబడి త్రివిక్రమ్‌తోనే కానిచ్చేస్తాడా.? సూపర్ స్టార్ ఏమైనా చేయగలడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com