‘లాల్ సింగ్ చద్దా’: ఇద్దరూ ఇద్దరే.. దోస్తీని నిలబెట్టుకుంటారా.?
- August 08, 2022
‘నువ్వు చెడ్డీ అయితే, నేను బనియన్‌లాగా..’ అంటూ, నాగ చైతన్య, అమీర్ ఖాన్ ఇద్దరూ దోస్తీల్లా భలే సెట్టయిపోయారు ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో. వీరిద్దరి అనుబంధం చూస్తుంటే, చాలా ముచ్చటేసుకొస్తోంది.
ట్రైలర్‌లో కట్ చేసిన కొన్ని సీన్లు ఎమోషనల్‌గా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోతున్నాయ్. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. అందులోనూ ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో సమర్పిస్తుండడంతో మరింత బెనిఫిట్ అయ్యేలా కనిపిస్తోంది.
మరో ప్లస్ పాయింట్ ఏంటంటే, రిలీజ్‌కి ముందే సినిమా నెగిటివిటీని మూట కట్టుకుంది. ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా’ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ఈ సినిమాపై దుష్ర్పచారం షురూ చేసేశారు కొందరు దురభిమాన నెటిజనం.
నెగిటివిటీ స్ర్పెడ్ అయిన కొన్ని సినిమాలు రివర్స్ ఎటాక్ ఇచ్చి, హిట్టూ, సూపర్ హిట్లూ అయిపోతున్నాయ్ ఈ మధ్య. ‘సర్కారు వారి పాట’ సినిమాకి అలాగే లక్కు కలిసొచ్చింది. అలాగే, ‘లాల్ సింగ్ చద్దా’కీ టైమ్ కలిసొస్తే, సూపర్ హిట్ కళ కనిపిస్తోంది.
ఇక, ఈ సినిమా కోసం అమీర్ ఖాన్‌తో చైతూ దోస్తీ కట్టడమనే కాన్సెప్ట్ బాగుంది. వయసు రీత్యా, హీరోగా అనుభవం దృష్ట్యా అమీర్ ఖాన్ చాలా చాలా ఘనం. కానీ, చైతూని మ్యాచ్ చేసేశాడు. అలాగే, చైతూని తీసుకున్నా, అమీర్ ఖాన్ వంటి గొప్ప నటుడ్ని మ్యాచ్ చేయడమంటే అంత ఆషా మాషీ కాదు.
ప్రచార చిత్రాల్లోనే ఇంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడంటే, ఇక సినిమాకి ప్రాణం పెట్టేసే వుంటాడు చైతూ. అసలే చైతూ మామూలోడు కాదు. మంచి నటుడు. చూడాలి మరి, ఈ చెడ్డీ, బనియన్ దోస్తీ ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ హిట్ అవుతుందా.? లేక చప్పగా నీరు కారిపోతుందా.? అనేది ఆగస్ట్ 11 న తేలిపోనుంది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







