వారసుడి ఎంట్రీ షురూ: మాస్ రాజా ఫ్యామిలీ హీరో వచ్చేస్తున్నాడహో.!
- August 09, 2022
మాస్ రాజా రవితేజ వారసుడి తెరంగేట్రం మొదలైంది. ఆగండాగండి.. వారసుడు అంటే, రవితేజ తనయుడు అనుకునేరు. అందుకు ఇంకాస్త టైమ్ వుంది. ఇప్పుడైతే, రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
గత కొన్నాళ్లుగా మాధవ్ ఎంట్రీపై ప్రచారం జరుగుతోంది. తాజాగా మాధవ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ, సినిమా డీటెయిల్స్‌తో సహా అధికారికంగా ప్రకటన విడుదలైంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాణంలో రూపొందబోయే సినిమాతో మాధవ్ తెరంగేట్రం చేస్తున్నాడు.
‘ఓయ్ పిల్లా’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. రుబెల్ హీరోయిన్గా నటిస్తోంది. 90ల నాటి లవ్ స్టోరీగా ఈ సినిమా కథ వుండబోతోందట. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట.
సోదరుడి తనయుడే అయినా, మాధవ్‌ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత అంతా తనపైనే వేసుకున్నాడు రవితేజ. ఆ తర్వాత రవితేజ తనయుడు మహాధన్ ఎంట్రీ కూడా వుండబోతోంది. చైల్డ్ ఆర్టిస్టుగా మహాధన్ ఆల్రెడీ కెమెరాని ఫేస్ చేశాడు. రవితేజ హీరోగా రూపొందిన ‘రాజా ది గ్రేట్’ మూవీలో రవితేజ చిన్నప్పటి పాత్రలో మహాధన్ కనిపించాడు. ఇక త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడట.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







