బిజెపితో బంధానికి స్విస్తి పలికిన బీహార్ సీఎం
- August 09, 2022
పాట్నా: బిహార్ సిఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్ బిజెపితో బంధానికి స్విస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈరోజు జేడీయూ పార్టీ నేతల సమావేశంలో నిర్ణయంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బిజెపితో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి నేడు గుడ్‌బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్‌లో ముగిసిపోయింది.
బిజెపితో తెగదెంపులు చేసుకున్నట్లు జేడీ నేత నితీశ్ తమ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి నితీశ్ కుమార్.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొనసాగనున్నారు.
అయితే కొన్ని ఊహాగానాల ప్రకారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు హోంశాఖ ఇవ్వనున్నారు. నితీశ్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







