గల్ఫ్ కార్మికుల అలాయ్ బలయ్ పోస్టర్ విడుదల
- August 10, 2022
కరీంనగర్: బహుజన రాజ్యం లో గల్ఫ్ గోసలు ఉండవని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు.ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రం లో తెలంగాణ చౌక్ లో గల్ఫ్ కార్మికుల అలాయ్ బలయ్ పోస్టర్ (గోడ పత్రిక ) పార్టీ నాయకులతో కలిసి విడుదల చేసారు.తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అయితే గల్ఫ్ కి వలసలు ఉండవని అన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలు అయ్యాయని అన్నారు.ఈ నెల 14 న దుబాయ్ లో బహుజన గల్ఫ్ కార్మికుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగే అలాయ్ బలయ్ భహిరంగ సభ కి బీ ఎస్ పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథి గా హాజరు అవుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులు అందరు ఆదివారం 14 న దుబాయ్ లో డలస్కొ సమావేశ స్థలంలో అల్కొస్ లో జరుగుతున్న సభ ను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ గోడ పత్రిక విడుదల కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ లు మాతంగి అశోక్, నల్లాల రాజేందర్, జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్,కరీంనగర్ జోన్ మహిళ కన్వీనర్ జన్ను స్వరూప,జిల్లా మహిళ కన్వినర్ జమున, ఉపాధ్యక్షలు శీలం రాజయ్య, జిల్లా కార్యదర్శి లు అడ్వకేట్ మంద రవీందర్, కొంకటి శేఖర్, సంగుపట్ల మల్లేష్ ,అసెంబ్లీ అధ్యక్షులు మంకాళి తిరుపతి, ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ మహిళ, స్వప్న, కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు గాలి అనిల్, శ్యామ్, మండల కన్వీనర్ ఆరెపల్లి వినోద్, కళ్లేపల్లి తిరుపతి ,శేఖర్, మహేంద్ర మనోహర్ ,ప్రవీణ్ ,టౌన్ అధ్యక్షుడు అస్టపురం మధు,చందు,తదితరులు పాల్గొన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







