సెప్టెంబర్‌లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ అంటోన్న సుధీర్ బాబు.!

- August 10, 2022 , by Maagulf
సెప్టెంబర్‌లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ అంటోన్న సుధీర్ బాబు.!

సుధీర్ బాబు ఏంటీ.? అమ్మాయి గురించి చెప్పడమేంటీ.? ఆల్రెడీ సుధీర్ బాబుకి పెళ్లయ్యింది కదా. కొడుకు కూడా వున్నాడు కదా. అనుకుంటున్నారా.? ఆగండాగండి. సుధీర్ బాబు చెప్పబోయే అమ్మాయి రియల్ లైఫ్ అమ్మాయి కాదు, రీల్ లైప్ అమ్మాయి గురించి.
సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. పోస్టర్‌ని బట్టి ఈ సినిమా ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్‌లో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. హీరోయిన్ పరుగెడుతుంటే, పక్కనే హీరో వెనక కెమెరా పట్టుకుని ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. పోస్టర్ ఆసక్తికరంగా వుంది. 
కానీ, ఈ తరహా నేపథ్యంలోనే ఆల్రెడీ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబో మూవీ ‘సమ్మోహనం’ రూపొందిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోయింది. అలాగే కృతి శెట్టిని తీసుకుంటే, ఇదే తరహాలో నానితో ‘శ్యామ్ సింఘ రాయ్’ మూవీలో నటించింది. షార్ట్ ఫిలిం హీరోయిన్‌గా ఆ సినిమాలో కృతి శెట్టి కనిిపంచింది. బహుశా ఈ సినిమాలో కూడా కృతి ఆన్ స్ర్కీన్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నట్లుగా అనిపిస్తోంది. చూడాలి మరి, 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com