మస్కట్‌ బీచ్‌లో 70 కిలోల గంజాయి పట్టివేత

- August 11, 2022 , by Maagulf
మస్కట్‌ బీచ్‌లో 70 కిలోల గంజాయి పట్టివేత

మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని బీచ్‌లో 70 కిలోలకుపైగా గంజాయిని రాయల్ ఒమన్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని బీచ్ లో అన్ లోడ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కంట్రోల్ జనరల్ డిపార్ట్‌మెంట్, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో చేపట్టిన దాడుల్లో గంజాయిని అన్‌లోడ్ చేసే ప్రయత్నంలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వివరించారు. వారివద్ద నుంచి 73 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com