జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది
- April 14, 2016
జపాన్ దక్షిణ ప్రాంతంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. అక్కడి స్థానిక కాలమానం ప్రాకారం రాత్రి 9.26 గంటలకు కమమొటో పరిధిలోని మషికి పట్టణంలో సంభవించిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు జపాన్ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. అయితే ఈ భూకంపంతో సునామీ ప్రమాదమేమీ లేదని వెల్లడించింది. భూకంపం దాటికి 30 సెకన్ల పాటు ప్రకంపనలు గుర్తించామని, ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయని స్థానికులు వెల్లడించారు.భూకంపంపై జపాన్ ప్రధానమంత్రి షింజో అబే స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు చేపడుతామని తెలిపారు. భూకంప కేంద్రం భూమిలోపల 23 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







