NBK108 మూవీ ప్రకటన
- August 11, 2022
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ–సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా రాబోతుందని ఎప్పటి నుండో వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారనే అప్డేట్తో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది కూడా ఓ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అలాగే ‘అఖండ’ అద్భుతమైన సక్సెస్‌కు ఓ కారణమైన సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక అనౌన్స్మెంట్ వీడియోలో.. ‘‘త్వరలో బాంబార్డింగ్…’’ అని తెలిపారు. ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ అదిరిపోయింది. అనౌన్స్మెంట్ బిజీఎంతోనే అదరగొడితే.. సినిమాలో ఏ స్థాయిలో మ్యూజిక్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా బరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







