వారాంతంలో వేడి మరియు ధూళి వాతావరణం ఊహించబడింది

- August 12, 2022 , by Maagulf
వారాంతంలో వేడి మరియు ధూళి వాతావరణం ఊహించబడింది

కువైట్: ఈ వారాంతంలో వాతావరణం వేడిగా ఉంటుందని, చురుకైన దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయిని కువైట్ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ అధికారి అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి మాట్లాడుతూ.. ఈ కాలంలో తేలికపాటి నుండి మితమైన వేగంతో వాయువ్య గాలులు వీస్తాయని, దీని వల్ల సమాంతర దృశ్యమానత తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 - 49 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని చెప్పారు. శుక్రవారం వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, వాయువ్యంగా మధ్యస్థం నుండి చురుకైన గాలులు గంటకు 20 - 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. శనివారం పగటిపూట వాతావరణం కూడా చాలా వేడిగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 46 - 48 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com