పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది సజీవ దహనం..
- August 16, 2022
పాకిస్థాన్: పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్‌లోని హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైవే పై అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత మంటలు ఎగిసిపడటంతో కొన్ని గంటలపాటు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న తర్వాత బస్సు, ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ తో పాటు 26 మంది ఉన్నారు. వీరిలో 18మంది మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరితో పాటు మరో ఆరుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్నవారిని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. గుర్తించలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను DNA పరీక్షల తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో పాకిస్థాన్ లోని ప్రావిన్స్ లో ఇది రెండో అతి పెద్ద ప్రమాదం. గత శనివారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న బస్సును చెరుకు లోడుతో వెళ్తున్న ట్రక్కు ఢీకొని పదమూడు మంది మరణించారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







