తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిల ప్రమాణస్వీకారం
- August 16, 2022
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు.హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.
కాగా, న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు నియామకమైన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా హైకోర్టులో 28 మంది జడ్జిలు ఉండగా.. కొత్త న్యాయమూర్తులతో మొత్తం సంఖ్య చేరింది. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేయగా.. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







