ఒమన్ లో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 16, 2022 , by Maagulf
ఒమన్ లో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మస్కట్: ఒమన్ దేశంలోని మస్కట్ సీబ్ మబేలా మస్కట్ మునిసిపాలిటీ క్యాంపులో కొత్త చిన్నయ్య, గాంధారి నరేష్ ఆధ్వర్యంలో బుడ్డల గంగాధర్, మెరుగు జగన్, సుంకపాక భూమేష్, కళ్ళెం కాశిరాం, తెడ్డు కార్తీక్, కోడే రమేష్, లంబ పర్షరాములు, చెప్పాల జగన్ సహాయంతో 75వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ ప్రవాసీయుల సహాకారంతో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించామని తెలిపారు. 

ముఖ్య అతిథులుగా టి.ఆర్.ఎస్. ఎన్.ఆర్.ఐ సెల్ ఒమన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్, తాటి కొండ నర్సయ్య  పాల్గొని ప్రసంగించారు. 
నేడు మనము 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అగస్టు 15వ తేది ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజని ఈనాడు భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని అన్నారు. 
స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు మన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారని క్రమంగా మన దేశాన్ని మొత్తం వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారని సుమారు 200ల సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించారని 1947 అగస్టు 15వ తేది అర్థ రాత్రి మన దేశానికి విముక్తి లభించిందని అప్పటి నుండి అగస్టు 15వ తేదిన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని అన్నారు. 

ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల వల్లనే మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామని వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి మన భారతదేశానికి బ్రిటిష్ వారి బానిసత్వం నుంచి విముక్తి కల్పించారని అలాంటి స్వాతంత్ర్య సమరయోధుల కష్టాలని, త్యాగాలని ప్రతి ఒక భారతీయుడు మరవరాదన్నారు. 

ఇంతటి స్వేచ్ఛనిచ్చిన మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వృధా కానివ్వరాదని మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలని అలాగే ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అని అన్నారు. 
ఈ అపురూపమైన అవకాశాన్ని ఇచ్చిన మస్కట్ మునిసిపాలిటీ క్యాంపులోని భారతీయ ప్రవాసీయులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో గాంధారి నరేష్, కొత్త చిన్నయ్య, కౌడపు దినేష్, బొడ్డుల కృష్ణ, శ్రీనివాస్, రాజ్ కుమార్, మెరుగు జగన్, బుడ్డల గంగాధర్, మేడిపట్ల లక్ష్మన్, పవన్, కళ్ళెం కాశిరాం, తెడ్డు కార్తీక్, జగన్, రమేష్, వెంకటేష్, నరేష్, జోగపూర్ శ్రీనివాస్, జంబుక శ్రీనివాస్, కొల్లపురం రాములు, వేణు, భూమేష్, ఆనంద్, నవీన్, శంకర్, ఎల్లయ్య, దినేష్, రాజు, వంశి, రమేష్, సుభాష్, సాయగౌడ్, రాజు, పర్షరాములు, గణేష్, రాంబాబు, నాని, సురేష్, పోషన్న, మొదలగు భారతీయ ప్రవాసీయులు అధిక సంఖ్యలో పాల్గోన్నారని తెలిపారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com