సైబరాబాద్ లో ‘సామూహిక జాతీయ గీతాలాపన' విజయవంతం

- August 16, 2022 , by Maagulf
సైబరాబాద్ లో ‘సామూహిక జాతీయ గీతాలాపన\' విజయవంతం
హైదరాబాద్: '75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  అదేశాల మేరకు సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద జరిగిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ముఖ్య అతిథిగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ,డోగ్రా రెజిమెంట్ Colonel గోపాల్ రాజ్ పురోహిత్ (Sena Medal), డీసీపీ ట్రాఫిక్ టీ.శ్రీనివాస్ రావు మాదాపూర్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, డోగ్రా రెజిమెంట్ సైనికులు తదితరులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.
 
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని వివిధ ప్రాంతాల్లో, వాణిజ్య సముదాయలు, గేటెడ్ కమ్యూనిటీలు/ అపార్ట్ మెంట్స్, కాలేజీలు, స్కూళ్లు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతమైంది. సైబరాబాద్ లో నివసిస్తున్న ప్రజలు, దేశంలోని వివిధ  ప్రాంతాలకు చెందిన సైబరాబాద్ లో నివసిస్తున్న/పనిచేస్తున్న 6 వేల మంది ప్రజలు జాతీయ జెండాలు చేతబూని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ.. అంతా ఒక్కటిగా, ఒక్కసారిగా సామూహిక జాతీయ గీతాలాపన చేసి తమ దేశభక్తిని, దేశ ఐక్యతను చాటారు. ''వందేమాతరం", ''జై జవాన్- జై కిసాన్'' నినాదాలు మార్మోగాయి.
 
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్  స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి 22  వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వేడుకలను విజయవంతం చేయడంలో ప్రజలు, పోలీసులు, ప్రతీ ఒక్కరూ కీలకపాత్ర పోషించారని అభినందించారు.
 
దేశం కోసం తమ సర్వస్వాన్ని ధారవోసి, మరణానికి వెనుకాడకుండా మడమతిప్పని పోరాటాలు చేసిన సమరయోధుల స్ఫూర్తి, త్యాగనిరతితో మనం ఈ యొక్క స్వతంత్ర భారత వజ్రోత్సవాల జరుపుకుంటున్నామన్నారు. 
 
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11.30 గంటలకు ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతాలాపన చేయాలనే ప్రభుత్వ సూచనల నేపథ్యంలో సైబరాబాద్ కమీషనరేట్ లోని పలు జంక్షన్లలో ప్రజలు ట్రాఫిక్ జంక్షన్లలో స్వచ్ఛందంగా ట్రాఫిక్‌ను నిలిపివేసి.. జాతీయ గీతాలాపన చేశారన్నారు. 
 
ఈరోజు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొన్న వారిలో పోలీసు, సైన్యం, IT కంపెనీలు & IT పార్కులు, ఐటీ ఉద్యోగులు, నిర్మాణ సిబ్బంది, ఆధ్యాత్మిక నాయకులు, భద్రత, గృహనిర్వాహక సిబ్బంది, నిర్మాణ సంస్థలు, SCSC వాలంటీర్ల బృందం, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు, హాస్టల్ మరియు అపార్ట్ మెంట్ వాసులు, ఇలా ప్రతీ రంగానికి చెందిన దేశంలోని అన్ని ప్రాంతాల పౌరులతో కలిసి ఉండే శక్తి మరియు స్ఫూర్తికి ఇది ఒక అద్భుతమైన సందర్భమన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, సంస్థలు, బ్యాంకులు, విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్లు ఇలా ప్రతిఒక్కచోట సామూహికంగా జాతీయ గీతాన్ని అలాపించి దేశభక్తిని చాటారన్నారు.  
 
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, 4K రన్, ఫ్రీడమ్ రైడ్, బైక్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు, సామూహిక జాతీయ గీతాలాపన వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు తమ దేశ భక్తిని చాటుకున్నారన్నారు. 
 
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర’ రావు  ఆదేశాలతో ఈ నెల 8 నుంచి 22  వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వేడుకలను విజయవంతం చేసిన ప్రజలు, పోలీసులు, ప్రతీ ఒక్కరూ పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలు అన్నారు. ప్రజలందరినీ భాగస్వామ్యంతో దేశ భక్తిని చాటుకునే విధంగా గర్వంగా ముందుకుపోయే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.  
 
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర డోగ్రా రెజిమెంట్ Colonel గోపాల్ రాజ్ పురోహిత్ (Sena Medal), డీసీపీ ట్రాఫిక్ టీ.శ్రీనివాస్ రావు  మాదాపూర్ డీసీపీ  శిల్పవల్లి, జోనల్ కమీషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, MRO వంశీ మోహన్, మాజీ కార్పోరేటర్ సాయి బాబా, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల, సీఏఆర్ ఏడీసీపీ రియాజ్, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ఏసీపీ మట్టయ్య, డోగ్రా రెజిమెంట్ సైనికులు, గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ సురేశ్, ఇతర ఇన్ స్పెక్టర్ లు, SCSC వాలంటీర్ల బృందం, తదితరులు పాల్గొన్నారు.
 
- అలాగే SCSC, CREDAI, Google, ICICI Bank, Virtusa, Broadcom, Wipro, Infosys, Amazon, Kapil Chits , Union Bank , IIRM, Microsoft , Cap Gemini, Waverock సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
 
- GAR Corp, Sumadhura Acropolis, Vamsiram Builders, SMR Builders, Aparna Constructions, Sumadhura Construction, Phoenix Constructions, Mantri Celestia Apartments, Golf view Apartment residents, Golf edge Apartment residents, Brahma Kumaris, ISB students, Shereton Hotels, Marriot Hotels తదితర కంస్ట్రక్షన్ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు/ అపార్ట్ మెంట్స్ వాసులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com