భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు...
- August 16, 2022
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోనున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన 13 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రానిక్స్,మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు.ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వేతనంగా చెల్లిస్తారు.
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేది సెప్టెంబర్ 5, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్; https://www.bel-india.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







