తెలంగాణ కరోనా అప్డేట్
- August 16, 2022
హైదరాబాద్: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. క్రితం రోజుతో(265) పోలిస్తే కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 27వేల 348 మందికి కరోనా పరీక్షలు చేయగా, 406 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 177 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 29వేల 873 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 22వేల 667 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 095కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 17వేల 521 మందికి కరోనా పరీక్షలు చేయగా, 265 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







