బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా అరిస్తే SR100 జరిమానా

- August 17, 2022 , by Maagulf
బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా అరిస్తే SR100 జరిమానా

రియాద్: బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు హాని కలిగించే విధంగా ఎవరైనా బిగ్గరగా అరవడం చేస్తే SR100 జరిమానా విధించబడుతుందని సౌదీ పబ్లిక్ డెకోరమ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అబ్దుల్ కరీం తెలిపారు. ఈ మేరకు పబ్లిక్ డెకోరమ్ చట్టం నిబంధనలను మంత్రుల మండలి ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. సందర్శకులకు హాని కలిగించే లేదా భయపెట్టే లేదా ప్రమాదానికి గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా అరవడం లేదా ప్రవర్తించడం ప్రజా మర్యాద ఉల్లంఘనగా పరిగణించబడుతుందన్నారు. అలాంటి ఉల్లంఘనలకు SR100 జరిమానా విధించబడుతుందని అబ్దుల్ కరీం వివరించారు. నిబంధనల ప్రకారం..  పురుషులు, మహిళలు నిరాడంబరంగా దుస్తులు ధరించాలని, అసభ్యకరమైన భాష లేదా సంజ్ఞలను ఉపయోగించకూడదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, ఉమ్మివేయడం, అనుమతి లేకుండా వ్యక్తుల ఫోటోలు, వీడియోలు తీయడం, ప్రార్థన సమయాల్లో మ్యూజిక్ ప్లే చేయడం వంటి నిబంధనలు కొత్త చట్టంలో ఉన్నాయన్నారు. ఉల్లంఘనలకు SR50- SR6000 మధ్య జరిమానాలు విధించబడతాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com