నకిలీల పట్ల జాగ్రత్త.. ప్రవాసులను హెచ్చరించిన ఇండియన్ ఎంబసీ

- August 17, 2022 , by Maagulf
నకిలీల పట్ల జాగ్రత్త.. ప్రవాసులను హెచ్చరించిన ఇండియన్ ఎంబసీ

 

యూఏఈ: మోసపూరిత సోషల్ మీడియా హ్యాండిల్, ఇమెయిల్ ID గురించి ప్రవాసులను యూఏఈలోని భారతీయ రాయబార కార్యాలయం హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు భారతీయ పౌరులను మోసం చేయడానికి @embassy_help (Twitter), [email protected]ని ఉపయోగిస్తున్నారని ఎంబసీ పేర్కొంది. యూఏఈ నుండి భారతదేశానికి ప్రవాసుల ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని నేరస్థులు సందేశాలు పంపడం, డబ్బు వసూలు చేయడం ద్వారా మోసానికి పాల్పడతారని తెలిపింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి మోసగాళ్లు వినియోగిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ @embassy_help , ఇమెయిల్ ఐడి [email protected]తో ఎలాంటి అనుబంధం లేదని ఎంబసీ స్పష్టం చేసింది. అన్ని అధికారిక ఇమెయిల్ ఐడిలు, ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్‌బుక్ ఐడి, టెలిఫోన్ నంబర్‌లు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు ఎంబసీ తెలిపింది. @IndembAbuDhabi  ఏకైక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అని రాయబార కార్యాలయం తెలిపింది. 

--సుమన్ కొల్లగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com