రాబోయే నాలుగేళ్లకు ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ..
- August 17, 2022
రాబోయే నాలుగేళ్లకు ఎఫ్‌టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్‌లు పురుషుల క్రికెట్‌కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్‌ల షెడ్యూల్‌ను గురువారం(ఆగస్టు 17,2022) విడుదల చేసింది.
గతంతో పోలిస్తే కొత్త ఎఫ్‌టీపీలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌ల సంఖ్యలు గణనీయంగా పెరిగాయి. 2019-23 ఎఫ్‌టీపీలో అన్ని జట్లు కలిపి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడాల్సి ఉండగా.. ఐసీసీ 2023-27లో వీటి సంఖ్య మరింత పెంచింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నాలుగేళ్ల కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20లు ఉన్నాయి.
మొత్తంగా నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈ సైకిల్‌లో పురుషుల క్రికెట్ జట్లు 87 మ్యాచ్‌లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేళ్లలోనే ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్ కూడా జరుగనున్నాయి.
భారత్ విషయానికొస్తే.. 2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్‌లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికాలు భారత పర్యటనకు వస్తాయి. భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సఫారీ పర్యటనలకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







