త్వరలో ఫువైరిట్ కైట్ బీచ్ ప్రారంభం
- August 18, 2022
ఖతార్: ఫువైరిట్ కైట్ బీచ్ ను ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభించనున్నట్లు ఖతార్ టూరిజం తన అధికారిక సోషల్ మీడియా పేజీలో ప్రకటించింది. ఖతార్ ఫువైరిట్ కైట్ బీచ్.. ప్రపంచంలోని ఉత్తమ కైట్‌సర్ఫింగ్ బీచ్ లలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఔత్సాహికులు కైట్‌సర్ఫింగ్, పాడిల్-బోర్డింగ్, పారాసైలింగ్, వేక్బోర్డింగ్, కయాకింగ్, స్నార్కెలింగ్, స్కూబా-డైవింగ్, మరిన్ని వంటి సాహసోపేతమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చని తెలిపింది. బీచ్‌లో కైట్బోర్డింగ్తో పాటు రిసార్ట్, వసతి, యోగా స్టూడియో, జిమ్, పూల్ అండ్ స్నార్కెలింగ్, డైవింగ్ సేవలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఫువైరిట్ కైట్ బీచ్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 90 నిమిషాల దూరంలో ఉంది. ఈ సంవత్సరం జూలైలో ఖతార్ టూరిజం మూడు సంవత్సరాల పాటు గ్లోబల్ కైట్స్పోర్ట్స్ అసోసియేషన్ (GKA) కైట్ వరల్డ్ టూర్ అధికారిక పర్యాటక భాగస్వామిగా ఎంపికైన విషయం తెలసిందే. ఖతార్‌లో జరిగే ఈవెంట్లకు ఖతార్ టూరిజం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2023లో GKA వరల్డ్ టూర్ ఓపెనింగ్, ఫైనల్స్ ఇదే బీచ్ లో జరుగనున్నాయని గతంలో GKA సెక్రటరీ-జనరల్ డాక్టర్ జోర్గెన్ వోగ్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







