దోఫర్ ఖరీఫ్ సీజన్‌లో ప్రయాణించిన 315,000 మంది
- August 18, 2022
మస్కట్ : జూన్ ప్రారంభం నుండి ఆగస్టు 13 వరకు దోఫర్ ఖరీఫ్ సీజన్‌లో 315,000 మంది ప్రయాణికులు సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. ఇదే సమయంలో ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ విమానాల సంఖ్య వారానికి 195 విమానాలకు చేరుకుందని సలాలా ఎయిర్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ బిన్ అవద్ అల్ యాఫీ తెలిపారు. ఈ వేసవిలో అరేబియా గల్ఫ్‌లోని పర్యాటక ప్రదేశాలలో గవర్నరేట్ ఒకటిగా మారిందని ఆయన పేర్కొన్నారు. అబుదాబి, బహ్రెయిన్ నుండి వారానికి రెండు విమానాలు(గల్ఫ్ ఎయిర్), కువైట్ నుండి వారానికి 6 విమానాలు(జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్), సౌదీ అరేబియాలోని రియాద్ నుండి వారానికి 4 విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







