తెలంగాణ కరోనా అప్డేట్
- August 18, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో(507) పోలిస్తే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 199 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 29 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 30వేల 815 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 23వేల 884 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 820కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 33వేల 046 మందికి కరోనా పరీక్షలు చేయగా, 507 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్లో ‘ఇత్కాన్’ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







