పాయల్ రాజ్‌పుత్ పబ్లిసిటీ కోసమే అలా మాట్లాడిందా.?
- August 18, 2022
పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్‌కి పరిచయం అక్కర్లేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారులో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఈ అందాల భామ. అయితే, అలా దక్కించుకున్న పేరుతో అమ్మడు స్టార్ డమ్ సంపాదించుకోలేకపోయిందనుకోండి.
అయితే, పాయల్ రాజ్‌పుత్ మంచి టాలెంటెడ్. కేవలం అందాల ఆరబోతే కాదు, ఛాలెంజింగ్ పాత్రల్లోనూ మెప్పించగల టాలెంట్ ఆమె సొంతం. అయితే, టాలెంట్ వుంటే సరిపోదుగా. అదృష్టం కూడా వుండాలి. ఆ అదృష్టం పాయల్ రాజ్పుత్ని వరించేందుకు కాస్త ఆలోచిస్తున్నట్లుంది.
మూడేళ్ల క్రితం స్టార్ట్ అయిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి నోచుకుంది. రేపు అనగా ఆగస్టు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆది సాయి కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్ల ద్వారా ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి తెలిసింది.
వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ, ఆదికి కూడా ఓ మంచి హిట్ పడనే లేదింతవరకూ. అలాగే పాయల్ రాజ్‌పుత్ కూడా. వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్నా స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది. చూడాలి మరి, ‘తీస్మార్ ఖాన్’ సినిమా ఈ ఇద్దరికీ బ్రేక్ ఈవెన్ అవుతుందేమో.!
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







