శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- August 19, 2022
హైదరాబాద్: విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 436 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను శనివారం తనిఖీలు చేస్తున్నారు.షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తి వద్ద 436 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు.ఎలక్ట్రిక్ బ్లెండర్స్ లో బంగారం అమర్చి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన స్మగ్లర్.
వ్యక్తి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం విలువ షుమారు రూ.23,14,200 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







