భారత విద్యార్థులకు గుడ్ న్యూస్..

- August 19, 2022 , by Maagulf
భారత విద్యార్థులకు గుడ్ న్యూస్..

న్యూ ఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ వదిలి వచ్చిన భారతీయ విద్యార్థులకు ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశం నుంచి తిరిగి వెళ్లిన భారతీయ మెడికల్ విద్యార్థులు తిరిగి ఉక్రెయిన్ రావాలని కోరింది. వచ్చే సెప్టెంబర్ నుంచి అక్కడి యూనివర్సిటీల్లో ఆఫ్‌లైన్ క్లాసులతోపాటు, పరీక్షలు కూడా నిర్వహించబోతున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

అయితే, అక్కడ మెడికల్ కోర్స్ చదవాలనుకునే విద్యార్థులు స్థానిక అర్హత పరీక్ష అయిన ‘క్రాక్’ రాయాల్సి ఉంటుంది. ఈ ఆఫ్‌లైన్ పరీక్షలో విజయం సాధిస్తేనే అక్కడ మెడిసిన్ చదవొచ్చు. ఈ పరీక్ష వచ్చే అక్టోబర్‌లో జరుగుతుంది. త్వరలో క్లాసులు ప్రారంభమయ్యే అంశం గురించి భారతీయ విద్యార్థులకు సమాచారం అందించినట్లు యూనివర్సిటీలు తెలిపాయి. ‘‘వచ్చే నెల 1 నుంచి ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయి. మీ భద్రతకు గ్యారంటీ మాది’’ అంటూ తనకు ఉక్రెయిన్ యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చినట్లు అష్నా పండిట్ అనే ఒక విద్యార్థిని తెలిపింది.ఆమె ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉన్న తారాస్ షెచెన్కో నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతోంది.

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా మెడిసిన్ చదివేందుకు వెళ్లారు.అయితే అక్కడి యుద్ధం కారణంగా గత మార్చిలో విద్యార్థులంతా ఇండియా తిరిగొచ్చారు. చదువు మధ్యలో ఆగిపోవడంతో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు. ఇండియాలోనే తమకు మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కల్పించాలని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరిగి అక్కడ క్లాసులు ప్రారంభమవుతుండటం దాదాపు 20 వేల మంది విద్యార్థులకు మేలు కలిగిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com