బీ టౌన్‌లోనూ ‘కార్తికేయ 2’ హవా మామూలుగా లేదుగా.!

- August 19, 2022 , by Maagulf
బీ టౌన్‌లోనూ ‘కార్తికేయ 2’ హవా మామూలుగా లేదుగా.!

టాలీవుడ్‌లో తొక్కివేయబడ్డ సినిమాగా బోలెడంత సింపథీ గెయిన్ చేసుకుంది ‘కార్తికేయ 2’ సినిమా. ఆ సింపథీనే వర్కవుట్ అయ్యిందో, లేక కంటెంట్ నిలబెట్టేసిందో తెలీదు కానీ, మొత్తానికి ‘కార్తికేయ 2’ సూపర్ డూపర్ హిట్ సినిమా లిస్టులోకి చేరిపోయింది.
బాక్సాఫీస్ వద్ద సెలవులతో సంబంధం లేకుండా వసూళ్లు కొల్లగొడుతోంది. ఇక, బాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ సినిమా అక్కడ కూడా రాకెట్ స్పీడుతో దూసుకెళుతోంది. మొదట 50 ధియేటర్లు మాత్రమే దక్కించుకున్న ‘కార్తికేయ 2’ సక్సెస్ టాక్‌తో ప్రస్తుతం 700 ధియేటర్లను ఆక్యుపై చేసింది.
సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కంటెంట్ వున్నోడికి కటౌట్‌తో పని లేదు.. అంటే ఇదే మరి. ఎంతలా తొక్కేయాలనుకున్నా ‘కార్తికేయ 2’ని తొక్కేయడం సాధ్యం కాలేదు. 
ఇక బాలీవుడ్‌లో ఇంతవరకూ నిఖిల్ అంటే ఎవరికి తెలీదు. కానీ, కంటెంట్ బేస్ మూవీస్‌కి హీరో, హీరో ఇమేజ్‌తో కూడా పని లేదని మరోసారి కార్తికేయ 2 సినిమాతో ప్రూవ్ అయ్యింది. శ్రీ కృష్ణుడి చరిత్ర ఆధారంగా రూపొందిన ‘కార్తికేయ 2’ అంత పెద్ద హిట్ అవ్వడానికి ఆ హిస్టరీనే ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్నారు.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com