‘లైగర్ 2’ కూడా వుంది. కానీ, రౌడీ ఏం చేస్తాడో.!

- August 19, 2022 , by Maagulf
‘లైగర్ 2’ కూడా వుంది. కానీ, రౌడీ ఏం చేస్తాడో.!

రౌడీ స్టార్‌గా పిలవబడే విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీ మేనియా నడుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే అంటే, ఆగస్టు 25న ‘లైగర్’ దేశ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ క్షణం తీరిక లేకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా తిరుగుతున్నారు. 
విజయ్ దేవరకొండ సినిమాలంటే మామూలుగానే బోలెడంత క్రేజ్. అలాంటిది తొలిసారి విజయ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడంతో, ‘లైగర్’పై భారీగా అంచనాలున్నాయ్. 
చిత్ర యూనిట్ కూడా ఏమాత్రం తగ్గేదే లే.. అన్నట్లుగా కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. రికార్డులు దద్దరిల్లిపోతాయ్.. అంటూ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. అయితే, రిలీజ్‌కి ముందు బజ్ ఎలా వున్నా, రిలీజ్ తర్వాత రిజల్ట్ బట్టే కదా సినిమా భవిష్యత్తు ఆధారపడేది. 
సో, ‘లైగర్’ రిజల్ట్ ఎలా వుండోబోతోందో కానీ, ఈ సినిమాకి సీక్వెల్‌ని ప్రకటించేశాడు తాజాగా విజయ్ దేవరకొండ. అంటే, డైరెక్టుగా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ సినిమాకి సీక్వెల్ వుండబోతోందనీ చిన్న హింట్ అయితే పాస్ చేశాడు. ‘లైగర్’ రిజల్ట్‌ని బట్టి ఆ సీక్వెల్ ప్లానింగ్ వుండబోతోందట. 
అన్నట్లు విజయ్ దేవరకొండ, ‘లైగర్’ తర్వాత పూరీ జగన్నాధ్‌తోనే ‘జనగణమన’ సినిమా చేయాల్సి వుంది. ఊహించినట్లుగానే ‘లైగర్’తో విజయ్ గట్టిగా కొట్టాడంటే, ‘జనగణమన’ని వాయిదా వేసి, లైగర్ 2 పట్టాలెక్కించేసినా ఎక్కించేస్తాడేమో. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com