మాస్ సినిమాల రిలీజ్ ఏప్రిల్‌లో. ..
- April 15, 2016
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్ సీజన్ లో భారీ సినిమాలు వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే రిలీజ్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు మన దర్శక నిర్మాతలు. ఒక నెలలో పూర్తిగా మాస్ సినిమాలను రిలీజ్ చేసి తరువాత వరుసగా క్లాస్ సినిమాల రిలీజ్ లకు రెడీ అవుతున్నారు.
ఈ లిస్ట్ లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్, టాక్ సంగతి ఎలా ఉన్నా.., ఈ సినిమా పూర్తిగా మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూనే తెరకెక్కించారు. ఇక మంచు వారబ్బాయి ఈడో రకం ఆడో రకం కూడా బోల్డ్ కాన్సెప్ట్ తో యూత్, మాస్ ఆడియన్స్ కోసమే తెరకెక్కింది. రిలీజ్ కు రెడీ అవుతున్న అల్లు అర్జున్ సరైనోడు ఊర మాస్ అంటూ ట్రైలర్ లోనే కన్ఫామ్ చేసేశారు. ఇవేకాదు డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న విజయ్ పోలీస్ కూడా మాస్ ఆడియన్స్ కు కిక్ ఇచ్చే సినిమా అన్నటాక్ వినిపిస్తోంది. ఇలా ఏప్రిల్ నెలంతా మాస్ సినిమాలు మోత మొగిస్తున్నాయి.ఇక మే నెలల రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో పూర్తిగా క్లారిటీ లేకపోయినా అన్నీ క్లాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. డేట్ కన్ఫామ్ చేయకపోయినా మహేష్ బ్రహ్మోత్సవం మే లోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లోనే ఓన్లీ ఫర్ క్లాస్ అని తేల్చేశారు. ఇక త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న అ.. ఆ.. కూడా క్లాస్ ఎంటర్ టైనర్ లాగే కనిపిస్తోంది. డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతున్న సూర్య 24లో మాస్ ను ఆకట్టుకునే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నా.. సైన్స్ ఫిక్షన్ సినిమా కావటంతో ఇది కూడా క్లాస్ ఆడియన్స్ కే బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







