ఆసియా కప్: ఎక్కువ సార్లు గెలిచిన టీం...
- August 19, 2022
దుబాయ్: ఈనెల 27 నుంచి దుబాయ్ వేదికగా ఆసియాకప్ 2022 జరగనుంది.ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లతో పాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు మరో క్వాలిఫయర్ జట్టు కూడా పాల్గొంటాయి.
ఈ ఏడాది జరగబోతున్న ఆసియాకప్ 15వది. అంటే 2018 వరకూ 14 టోర్నీలు జరిగాయి. మొదటిసారి ఆసియాకప్ 1984లో జరిగింది. 2016లో తొలిసారి ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరిగింది. అందులో ఇండియా విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2018లో చివరిసారి వన్డే ఫార్మాట్ లో ఆసియాకప్ జరిగిన సమయంలోనూ ఇండియానే గెలిచింది.ఈ ఏడాది మరోసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగబోతోంది. మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరుగుతుండటంతో నిర్వాహకులు ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆసియాకప్‌లో భాగంగా 14 టోర్నీలు జరిగాయి.అందులో 7 సార్లు ఇండియానే టైటిల్ సొంతం చేసుకుంది. చివరి రెండుసార్లు కూడా ఇండియానే విజేతగా నిలిచింది. అటు చివరిగా జరిగిన రెండు టోర్నీల్లో రన్నరప్ బంగ్లాదేశ్ కావడం గమనార్హం. 2012 నుంచి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ మూడుసార్లు ఫైనల్ రావడం విశేషం. ఆసియాకప్ చరిత్రలో ఇండియా తర్వాత శ్రీలంక ఐదుసార్లు గెలిచి రెండోస్థానంలో నిలవగా.. పాకిస్థాన్ రెండుసార్లు మాత్రమే ఆసియాకప్ విజేతగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







