రస్ అల్ ఖైమాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం
- August 20, 2022
యూఏఈ: దేశంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం తేలికపాటి నుండి మధ్యస్థ వర్షపాతం నమోదయిందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. రస్ అల్ ఖైమాలోని మసాఫీలో మధ్యాహ్నం 3:00 గంటలకు తేలికపాటి వర్షం పడింది. అలాగే దఫ్తాలో మధ్యస్థంగా, మసాఫీ - దఫ్తా రహదారిపై భారీగా, షోకా - అల్ మనాయ్ రహదారిపై తేలికగా, రస్ అల్ ఖైమాలోని వాడి అల్ తవాలో భారీగా వర్షం కురిసిందని ఎన్సీఎం వెల్లడించింది. దీంతో అల్ ఐన్‌లోని రాక్నా ప్రాంతంలో తెల్లవారుజామున 03:45 గంటలకు 24.4°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. శనివారం నుండి మంగళవారం వరకు వాతావరణం కొన్ని సమయాల్లో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని NCM అంచనా వేసింది. ఆగ్నేయం నుండి ఈశాన్య దిశలో గాలులు గంటకు 40 కి.మీ. వేగంతో వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NCM హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







