నగరాల భద్రతా సూచికలో ఫుజైరాకు తొలిస్థానం

- August 20, 2022 , by Maagulf
నగరాల భద్రతా సూచికలో ఫుజైరాకు తొలిస్థానం

యూఏఈ: నగరాల వారీగా భద్రతా సూచికలో ఫుజైరా(Fujairah) మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక, భద్రతా రంగాలపై నివేదికలను అందించే నుంబియో(Numbeo) ఈ జాబితాను రూపొందించింది. 466 అంతర్జాతీయ నగరాలు ఉన్న ఈ జాబితాలో ఫుజైరా 93 శాతం కంటే ఎక్కువ స్కోర్‌ను నమోదు చేసి తొలిస్థానం పొందింది. ఉన్నత జీవన ప్రమాణాల కారణంగా ఈ ఎమిరేట్‌ నగరం అన్ని దేశాల కుటుంబాలకు సురక్షితమైన ప్రదేశంగా నిలిపింది. ఫుజైరా పోలీసు అధికారిక లెక్కల ప్రకారం.. ఎమిరేట్‌లో నేరాల రేటు అత్యల్పంగా ఉన్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com