శ్రీరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్ కుటుంబసభ్యులు..
- April 15, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందచేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్ లో భద్రాచలం చేరుకున్నారు. శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ కు మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.కాగా కేసీఆర్ కుటుంబసభ్యులు గతరాత్రే భద్రాచలం చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న రాములోరి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. మరోవైపు భద్రాచలం భక్తజన సందోహం అయింది. శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









