మళ్లీ ఇలియానా టాలీవుడ్‌లో మెరవనుంది
- April 15, 2016
ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్. దేవదాసు చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈ అమ్మడు 2012 వరకూ కొనసాగింది. తర్వాత తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. బాలీవుడ్‌లో మాత్రం ఏడాదికొకటి చొప్పున చేస్తోంది. ఇప్పుడు అక్షరు కుమార్‌తో కలసి 'రస్టోమ్' చేస్తోంది. తెలుగులో మాత్రం ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమిటంటే టాలీవుడ్‌లో నటించేందుకు తన పారితోషికాన్ని కూడా తగ్గేసుకుంది. గత చిత్రాల్లో చేసిన దానికంటే మరింత గ్లామర్‌గా నటించేందుకూ అంగీకరిస్తుందట. అయినా అవకాశాలు దక్కకపోవడం విశేషం. మరికొన్ని రోజుల్లో తెలుగులో రెండు ప్రాజెక్టులు చేయొచ్చని తెలిసింది. వాటిపై ప్రస్తుతం చర్చలు జరుతున్నాయని సమాచారం. అవి సఫలమైతే మళ్లీ ఇలియానా టాలీవుడ్‌లో మెరవనుంది.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







