రామ్ చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ పరిస్థితి అంతేనా.?

- August 23, 2022 , by Maagulf
రామ్ చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ పరిస్థితి అంతేనా.?

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ హుషారుగా పని చేసింది.
అయితే, ఇటీవలే ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం అనగా 2020లో అనుకోని ప్రమాదం కారణంగా చిత్ర యూనిట్‌లో ఒకరు మరణించడంతో ఈ సినిమా అర్ధాంతరంగా వాయిదా పడింది. 
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ‘విక్రమ్’ సినిమాతో కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. బాక్పాఫీస్ వద్ద కాసుల పంట పండించింది విడుదలైన అన్ని భాషల్లోనూ ‘విక్రమ్’ సినిమా. దాంతో, ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాలనుకుంటున్నారట. 
ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నానంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈ సినిమా తిరిగి సెట్స్ మీదికెళ్లనుంది. తాజా షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట చెన్నైలో.
అంతా బాగానే వుంది. మరి, రామ్ చరణ్ సినిమా సంగతేంటీ.? అంటే, ఈ సినిమా దాదాపు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందనీ అంటున్నారు. అయితే, అంత త్వరగా శంకర్ సినిమాలు పూర్తయ్యే అవకాశం లేదు. మరి, ఈ సినిమాని పక్కన పెట్టేసి, శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాపై ఫోకస్ పెడతాడా.? లేక జరుగుతున్న ప్రచారం ప్రకారం నిజంగానే చరణ్ సినిమా పూర్తి చేసేశాడా.? లేక రెండూ సమాంతరంగా పూర్తి చేస్తాడా.? తెలియాలంటే చరణ్ కానీ, శంకర్ కానీ క్లారిటీ ఇవ్వాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com