H1-B వీసా: 2023 ఏడాదికి సంబంధించి అమెరికా కీలక ప్రకటన!
- August 24, 2022
అమెరికా: H1-Bవీసాల విషయంలో అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) కీలక ప్రకటన చేసింది. అమెరికా కాంగ్రెస్ చెప్పినట్లుగా 2023 సంవత్సరానికిగానూ 65వేల వీసాలు జారీ చేయడానికి అవసరమైన అప్లికేషన్లు వచ్చాయని మంగళవారం ప్రకటనలో పేర్కొంది. ‘యూఎస్ కాంగ్రెస్ సూచించినట్టుగా 65వేల హెచ్1బీ వీసాలు జారీ చేయడానికి సరిపడా అప్లికేషన్లు అందాయి. వీటితోపాటు.. 2023ఆర్థిక సంవత్సరానికి యూఎస్ అడ్వాన్స్‌డ్ డిగ్రీ ఎగ్జెమ్షన్ కింద జారీ చేసే 20వేల H1-B వీసాల కోసం తగినన్ని దరఖాస్తులు వచ్చాయి’ వెల్లడించింది. అంతేకాకుండా వీసాల కోసం అప్లై చేసుకున్న వారికి ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా పంపినట్టు చెప్పింది.
ఇదిలా ఉంటే.. H1-B వీసాలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తి నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు గానూ యూఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాను జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రతిఏటా కొత్తగా దాదాపు 65వేల వీసాలతోపాటు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ కోసం మరో 20వేల వీసాలను కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే. ఇందులో అత్యధిక వీసాలు భారత్, చైనా పౌరులకే దక్కుతాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







