షూటింగులు బంద్: ఏం సాధించారీ నెల రోజుల్లో.!
- August 24, 2022
ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగులు బంద్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు సంబంధించిన కొన్ని సమస్యలు నెరవేర్చుకునేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నామంటూ కొందరు నిర్మాతలు కలిసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు.
అలా గత నెల రోజులుగా సినిమా షూటింగులు బంద్ అయ్యాయ్. అయితే, కొన్ని షూటింగులు యథాతథంగానే జరిగడం, వివాదాల్లోకెక్కడం కూడా జరిగింది. అయితే, షూటింగులు బంద్ చేయడం వల్ల నిర్మాతలు అనుకున్నది సాధించారా.? ఏమో వాళ్లకే తెలియాలి.
నెల రోజులు షూటింగుల బంద్ కారణంగా ఏ నిర్మాతలైతే నష్టపోతున్నామన్నారో, ఎవరైతే ఫలానా సమస్యలున్నాయంటూ రచ్చకెక్కారో.. వాళ్లకేం నష్టం కలగలేదు. సరికదా.. పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ, సన్నా చిన్నకారు కార్మికులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులు ఎందరో వున్నారు సినీ ఇండస్ర్టీలో. అలాంటి వాళ్ల పరిస్థితేంటీ.? ఎప్పుడూ వాళ్లకే నష్టం. కానీ, దాన్ని అర్ధం చేసుకున్నదెవరు.? ఇదే నిరసన సో కాల్డ్ నిర్మాతలు షూటింగులు ఆపకుండా కూడా చేయొచ్చు.
కానీ, అలా జరిగలేదు. సరే, ఈ నష్టం పూడ్చేదెవ్వరు.? మొత్తానికి సాధించింది ఏమున్నా లేకపోయినా, సెప్టెంబర్ 1 నుంచి యథా తధంగా షూటింగులు మొదలు కానున్నాయట. అదీ సంగతి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







