జనాన్ని చూసి ‘లైగర్’ ఎందుకంత షాక్ అవుతున్నాడు.?
- August 24, 2022
‘సాలా ది క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతోన్న సినిమా ‘లైగర్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ తమ ప్రయత్నాలు చేస్తోంది గత కొంత కాలంగా.
ఇప్పటికే బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. ప్యాన్ ఇండియా వైజ్ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఆగస్ట్ 25 అంటే ఈ శుక్రవారమే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రకరకాల ప్రచార చిత్రాలు, ఇన్నోవేటివ్ ప్రమోషన్లతో ‘లైగర్’ టీమ్ మస్త్ బిజీగా వుంది.
అయితే, విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్లినా, జనం కోకొల్లలుగా తరలి వస్తున్నారు. ఆ మాస్ ఫాలోయింగ్ చూసి, విజయ్ దేవరకొండనే షాకవుతున్నాడట. అంతలా విజయ్ దేవరకొండలో ఏం ఎట్రాక్షన్ వుందో కానీ, ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా జనం తరలి వస్తున్నారు.
ఆ జనాన్ని చూసి, చాలా చాలా మాట్లాడాలనుకున్నా, నోటి వెంట మాటలు రావడం లేదంటూ విజయ్ చెబుతున్నాడు. ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నాననీ అంటున్నాడు. విజయ్ ప్రమోషన్ ఈవెంట్లకు ఇంతలా తరలి వస్తున్న జనం రేపు సినిమా విడుదలయ్యాకా, చూసేందుకు వస్తారా.? వస్తే కనుక అదో ప్రభంజనమే.
ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ఆశలన్నీ ‘లైగర్’ పైనే. ఈ సినిమాని బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్‌తో కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. అనన్యా పాండే హీరోయిన్గా నటించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







