భారత్ కరోనా అప్డేట్
- August 25, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 10,725 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,084 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 94,047 మంది కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.60 శాతం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,37,57,385గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.20 శాతం ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.39 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 3,92,837 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 210.82 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. వాటిలో రెండవ డోసులు 94.08 కోట్లు, బూస్టర్ డోసులు 14.50 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. నిన్న దేశంలో 23,50,665 డోసుల కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







