కాలేజీకి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కేసు పెట్టిన కూతురు

- August 28, 2022 , by Maagulf
కాలేజీకి డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కేసు పెట్టిన కూతురు

బహ్రెయిన్: తన కుమార్తె చదువు ఖర్చులను భరించడానికి నిరాకరించిన తండ్రిపై కోర్టు సీరియస్ అయింది. ఆమెకు నెలకు BD50 చెల్లించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తల్లి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కాలేజీ ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించడం మానేశాడని తండ్రిపై కూతురు ఆరోపించింది. తనతో పాటు తన సోదరుడి చదువు కూడా ఇబ్బందుల్లో పడిపోవడంతో కూతురు తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తన కళాశాల ఫీజులు, ఇతర ఖర్చులు చెల్లించేందుకు తన తండ్రి నిరాకరించాడని, దీంతో తన ఆర్థిక అవసరాలు తీర్చేందుకు తల్లిపై భారం పడుతుందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి తనకు ఎలాంటి ఆర్థిక భద్రత కల్పించలేదని, తన ఉన్నత చదువులు, పోషణ, ఖర్చులు, భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదని చెప్పింది. తన తండ్రి చర్య తనను, తన సోదరుడిని చాలా కష్టాల్లోకి నెట్టిందని, పెరుగుతున్న ఆర్థిక కట్టుబాట్ల కారణంగా తన తల్లికి తన ఖర్చులు భరించడం కష్టంగా ఉందని బాలిక కోర్టుకు తెలిపింది.  విచారణ సందర్భంగా బాలిక ఇప్పటికీ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నందున పాకెట్ మనీ పొందేందుకు అర్హులని కోర్టు అభిప్రాయపడింది. అమ్మాయి తన తండ్రి నెలవారీ ఆదాయం ఆధారంగా నెలవారీ భత్యాన్నికోర్టు నిర్ణయించింది. సదరు తండ్రి తన కుమార్తెకు నెలకు BD50 చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com