ఈ ఏడాదిలో వీకెండ్స్ తోపాటు మిగిలింది మూడే సెలవులు

- August 28, 2022 , by Maagulf
ఈ ఏడాదిలో వీకెండ్స్ తోపాటు మిగిలింది మూడే సెలవులు

యూఏఈ: ఈ సంవత్సరం వీకెండ్స్ కాకుండా ఇంకా మూడు మాత్రమే ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. మరోవైపు పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తున్నందునా.. చాలా మంది ప్రభుత్వ సెలవుదినం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం మిగిలిన మూడు అధికారిక సెలవులలో మొదటిది అక్టోబర్‌లో వస్తుంది. ఇది ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం.. ఇది అక్టోబర్ 8(శనివారం) నాడు వస్తుంది. ఇది శని-ఆదివారం సెలవు పొందే వారికి ఉపయోగం లేదు. కానీ శనివారాల్లో పని చేసే వారికి ఇది ఉపయోగం. ఇక యూఏఈ జాతీయ దినోత్సవం సెలవుదినం నాలుగు రోజుల వీకెండ్ లో భాగంగా వస్తుంది. డిసెంబర్ 1, 2, 3, 4 సెలవు దినాలుగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మిగిలి ఉన్న అధికారిక సెలవులను ప్లాన్ చేసి ఉపయోగించుకోండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com