ఆకాశ ఎయిర్ పై హ్యాకర్ల దాడి
- August 28, 2022
భారత విమానయాన రంగంలో ఇటీవలే అడుగుపెట్టిన ఆకాశ ఎయిర్ కు అప్పుడే కష్టాలు చుట్టుముట్టాయి.ఈ నెల 7న ఆకాశ తన విమాన సర్వీసులను ప్రారంభించింది.నెల రోజులు కూడా పూర్తికాకుండానే ఆ సంస్థ వినియోగదారులకు చెందిన డేటాపై హ్యాకర్లు పంజా విసిరారు. వినియోగదారుల డేటాను తస్కరించారు.దీనిపై స్పందించిన ఆకాశ ఎయిర్.. వినియోగదారులకు క్షమాపణలు తెలిపింది.
పేర్లు, జెండర్, వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్లను మాత్రమే హ్యాకర్లు తస్కరించారని వివరణ ఇచ్చింది. ప్రయాణ సంబంధ వివరాలు కానీ, ట్రావెల్ రికార్డులు కానీ, చెల్లింపు సమాచారం కానీ అందులో లేవని స్పష్టం చేసింది. అయితే, వారు తస్కరించిన కొద్ది సమాచారంతోనే ఫిషింగ్ తరహా మోసపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆకాశ ఎయిర్ సూచించింది.
ఈ నెల 25న ఆకాశ కంప్యూటర్ వ్యవస్థలో టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఎర్రర్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఆకాశ ఎయిర్ తన సిస్టం ఫంక్షనల్ ఎలిమెంట్స్‌ను పూర్తిగా మూసివేసింది. ఫలితంగా అనధికార యాక్సెస్‌ను నిరోధించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి సైన్-అప్ అయినట్టు ఆకాశ ఎయిర్ తెలిపింది. ఈ ఘటన కారణంగా జరిగిన ఎలాంటి అసౌకర్యానికైనా క్షమాపణలు కోరుతున్నట్టు పేర్కొంది. కాగా, ఈ హ్యాకింగ్‌పై ఆకాశ ఎయిర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కి ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







