తెలంగాణ కరోనా అప్డేట్
- August 28, 2022
హైదరాబాద్: తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. క్రితం రోజుతో (255) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 12వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 98 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 33వేల 951 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 27వేల 763 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 077కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 18వేల 571 మందికి కరోనా పరీక్షలు చేయగా, 255 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







